ఆలూరు, కర్నూలు ఏదైనా సరే

ABN , First Publish Date - 2021-12-09T05:29:19+05:30 IST

అధినాయకత్వం ఆదేశిస్తే ఆలూరు నుంచి ఎమ్మెల్యే అభర్థిగానైనా లేక కర్నూలు నుంచి ఎంపీగానైనా బరిలో ఉంటానని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు.

ఆలూరు, కర్నూలు ఏదైనా సరే
కార్యకర్తలతో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌

అధి నాయకత్వం ఆదేశిస్తే ఏ పదవికైనా పోటీ: ఎమ్మెల్సీ కేఈ

ఆలూరు, డిసెంబరు 8: అధినాయకత్వం ఆదేశిస్తే ఆలూరు నుంచి ఎమ్మెల్యే అభర్థిగానైనా లేక కర్నూలు నుంచి ఎంపీగానైనా బరిలో ఉంటానని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో జరిగిన చెన్నకేశవస్వామి రథోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున చౌదరి, న్యాయవాది ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో తాను కార్యాలయాలు ప్రారంభిస్తానని అన్నారు. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. బీసీలు అధికంగా ఉన్న ఆలూరు నియోజకవర్గానికి బలమైన నాయ కుడే అభ్యర్థిగా రావచ్చని అన్నారు. అనంతరం మొలగవల్లి కొట్టాల గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ రూ.లక్ష విరాళం అందించారు. సమావేశంలో టీడీపీ నాయకులు శీనప్ప, మోకమల్లయ్య, సాలిసాహెబ్‌, రంగస్వామి, వెంకటేశ్వర్లు, మాణిక్య, గోవప్రకాష్‌, భాస్కర్‌, సుబ్బారెడ్డి, ప్రసాద్‌, శ్రీనివాసులుగౌడ్‌, అనిల్‌, హరి, జహీర్‌, రఘు, శైలేష్‌, మాల నర్సింహులు, కమ్మ రామాంజనేయులు, సుబ్బరాయుడు, గోవింద్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T05:29:19+05:30 IST