గ్రామాలకు ఎయిర్ ఫైబర్ సర్వీస్
ABN , First Publish Date - 2021-09-04T04:53:15+05:30 IST
ఎయిర్ ఫైబర్ సర్వీసుల ద్వారా ఎమ్మిగనూరు, ఆదోని సబ్ డివిజన్‌లోని అన్ని గ్రామాలకు అత్యధిక స్పీడుతో 80 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్ సేవలు అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ కర్నూలు జిల్లా జనరల్ మేనేజర్ రమేష్ అన్నారు.

ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 3: ఎయిర్ ఫైబర్ సర్వీసుల ద్వారా ఎమ్మిగనూరు, ఆదోని సబ్ డివిజన్‌లోని అన్ని గ్రామాలకు అత్యధిక స్పీడుతో 80 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్ సేవలు అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ కర్నూలు జిల్లా జనరల్ మేనేజర్ రమేష్ అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యలయంలో ఎయిర్ ఫైబర్ సర్వీసులను ఆయన ప్రారంభించి డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవిధాంగా ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్ మురళీకృష్ణ, ఏజీఎం వెంకటరాములు, ఇంజనీర్లు మహ్మాద్ హుసేన్, సంజీవ్‌కుమార్, శ్రీనివాసలు, ముధుమోహాన్, ఎస్‌డీఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.