నూలు మిల్లును పరిశీలించిన ఏడీ

ABN , First Publish Date - 2021-11-24T05:01:42+05:30 IST

మండలంలో 25 ఏళ్ల క్రితం మూతబడ్డ నూలు మిల్లును మంగళవారం ఏపీ జౌళి శాఖ ఏడీ వి. హరికృష్ణ పరిశీలించారు.

నూలు మిల్లును పరిశీలించిన ఏడీ


పాణ్యం, నవంబరు 23 : మండలంలో 25 ఏళ్ల క్రితం మూతబడ్డ నూలు మిల్లును మంగళవారం ఏపీ జౌళి శాఖ ఏడీ  వి. హరికృష్ణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సొసైటీల పరిశీలనలో భాగంగా నూలుమిల్లును పరిశీలించినట్లు తెలిపారు.   మిల్లుకు రక్షణ లేకపోవడవంతో అస్తవ్యస్తంగా   తయారైందన్నారు. మిల్లుకు వేసిన సీళ్లుతీసివేసినట్లు తెలిపారు. మిల్లు సామగ్రి చిందరవందరగా వేసినట్లు తెలిపారు. మిల్లులోని భవనాలను, యంత్ర సామగ్రిని పరిశీలించామన్నారు. 2019 సెప్టెంబరు నుంచి వేతనాలు అందడం లేదని సెక్యూరిటీ గార్డులు తెలిపారు. అవసరమైతే మిల్లుకు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ డీఓ నరసింహరెడ్డి, ఏడీఓ  బసవరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-24T05:01:42+05:30 IST