‘విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు’
ABN , First Publish Date - 2021-10-29T05:03:40+05:30 IST
విధి నిర్వహణలో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జేడీఏ వరలక్ష్మి అన్నారు.

ఆలూరు రూరల్, అక్టోబరు 28: విధి నిర్వహణలో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జేడీఏ వరలక్ష్మి అన్నారు. గురువారం కురువల్లి గ్రామంలో ఏడీఏ సునీత ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమంలో జేడీఏ వరలక్ష్మి పాల్గొని రైతులకు సలహాలు సూచనలు చేశారు. అనంతరం ఆలూరు అగ్రికల్చర్ ల్యాబ్‌ను సందర్శించి, మండల పరిషత్ కార్యాలయంలో 5 మండలాల వీఏఏఎస్, వీహెచ్‌ఏఎస్, ఏవోఎస్, ఏఈఎస్‌తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జేడీఏ వరలక్ష్మి మాట్లాడుతూ పంట పొలాలను తప్పనిసరిగా ఈక్రాస్ నమోదు చేయాలని అన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సునీత, కురువల్లి సర్పంచ్ ఉప్పర రవి, వ్యవసాయ అధికారులు వెంకటేశ్వరగౌడ్, నరేంద్రకుమార్, మల్లేష్, మనెమ్మ, ఏఈవో జయరాం పాల్గొన్నారు.
హొళగుందను కరువు మండలంగా ప్రకటించాలి.. హొళగుందను కరువు మండలంగా ప్రకటించాలని మండల రైతులు జేడీఏ వరలక్ష్మికి ఆలూరులో గురువారం వినతిపత్రం అందజేశారు. కాకి సీతయ్య, కృష్ణయ్య, గవి సిద్ధప్ప మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులం ఖరీఫ్‌లో వేల ఎకరాలలో పత్తి, వేరుశనగ, మిరప వేసుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయామన్నారు. . రైతులు బసప్ప, లక్ష్మన్న, వీరస్వామి, మంజునాథ్ పాల్గొన్నారు.