‘నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు’

ABN , First Publish Date - 2021-06-23T05:17:58+05:30 IST

నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని ఎస్‌ఐ మల్లికార్జున హెచ్చరించారు.

‘నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు’

ఉయ్యాలవాడ, జూన్‌ 22: నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని ఎస్‌ఐ మల్లికార్జున హెచ్చరించారు. మంగళవారం ఆర్‌.పాంపల్లె గ్రామంలో మండల వ్యవసాయ అధికారి స్వాతితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఉన్న సమాచారం మేరకు గ్రామానికి చెందిన పత్తి ఆర్గనైజర్లు దస్తగిరి, మద్దిలేటి, కొండారెడ్డి ఇళ్లలో సోదాలు చేశామన్నారు. వీరి వద్ద 330 పత్తి ప్యాకెట్లు లభ్యం అయ్యాయని ఆయన తెలిపారు. అయితే వ్యవసాయ అధికారులతో వాటిని పరిశీలించగా ప్యాకెట్లకు కంపెనీ బిల్లులు సరిగా ఉన్నాయని, నకిలీవి కావని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐలు రాంభూపాల్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, ఏఈవోలు వెంకటేశ్వరరెడ్డి, రాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:17:58+05:30 IST