‘డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-05-18T05:59:08+05:30 IST

అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్‌ తిరుపాలయ్యపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్‌ చేశారు.

‘డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’

అవుకు, మే 17: అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్‌ తిరుపాలయ్యపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్‌ చేశారు. సోమవారం చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగుల నుంచి డాక్టర్‌ తిరుపాలయ్య డబ్బులు డిమాండ్‌ చేయటంతో విసుగు చెందిన మహిళ రోగులు ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగుల సమక్షంలోనే విచారించారు. ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో డాక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రోగులు మాట్లాడుతూ తాము చికిత్స కోసం వస్తే డాక్టర్‌ తిరుపాలయ్య సూదుల వేసి మందులు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 200 డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. సమయానికి ఆసుపత్రికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరారు.

Updated Date - 2021-05-18T05:59:08+05:30 IST