‘పొగ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-01-01T05:23:01+05:30 IST

మంత్రాలయం మండలంలోని మాధవరం దగ్గర మారుతి స్టీల్‌ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు తక్షణమే ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.జగన్నాథం డిమాండ్‌ చేశారు.

‘పొగ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి’


కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 31: మంత్రాలయం  మండలంలోని మాధవరం దగ్గర మారుతి స్టీల్‌ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,  అధికారులు తక్షణమే ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.జగన్నాథం డిమాండ్‌ చేశారు.  శుక్రవారం వారు మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం అప్పటి కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారన్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగవల్ల మిరప, పత్తి, ఉల్లి, వేరుశనగ, కంది, వరి పంట దెబ్బతింటున్నాయన్నారు. ఫ్యాక్టరీ వల్ల వచ్చే కాలుష్యాన్ని నివారించాలని కోరారు. 

Updated Date - 2022-01-01T05:23:01+05:30 IST