కిలో అరటి రూ.2

ABN , First Publish Date - 2021-12-25T06:11:45+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటి ధర పతనమైంది.

కిలో అరటి రూ.2
ట్రాక్టర్‌తో అరటి తోటను దున్నేస్తున్న రైతు

  1. ఎనిమిది ఎకరాల్లో దున్నేసిన రైతులు 


రుద్రవరం, డిసెంబరు 24: మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటి ధర పతనమైంది.  కిలో రూ.2 కావడంతో అరటి తోటలను రైతు లు శుక్రవారం ట్రాక్టర్‌తో దున్నేశారు. గుర్రప్ప 2 ఎకరాలు, నీరుకట్టు గుర్రప్ప 2 ఎకరాలు, వెంకటరమణ 4 ఎకరాలు మొత్తం 8 ఎకరాలు దున్నేశారు. రూ.8 లక్షల పెట్టుబడి పుడమి పాలైంది. 


కొనేవారు రాక దున్నేశా..

అరటిని కొనేవారు రాక 2 ఎకరాలు టాక్టర్‌తో దున్నేశా. కిలో రూ.2 రేటు పలకడంతో  రూ.2 లక్షలు నష్టపోయా. 

- గుర్రప్ప, రైతు, ఆలమూరు Updated Date - 2021-12-25T06:11:45+05:30 IST