నంద్యాలకు 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-22T05:31:35+05:30 IST

నంద్యాల పట్టణానికి 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి వెల్లడించారు.

నంద్యాలకు 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు: ఎమ్మెల్యే

నంద్యాల, జూన్‌ 21: నంద్యాల పట్టణానికి 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం సలీంనగర్‌లో రూ.80 లక్షలతో నిర్మించనున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల భవనాల నిర్మాణానికి రూ.4 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, చైర్‌పర్సన్‌ మాబున్నీసా, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.Updated Date - 2021-06-22T05:31:35+05:30 IST