2,263 మందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-02-06T05:29:47+05:30 IST

జిల్లాలోని 75 కేంద్రాల్లో 2,263 మందికి శుక్రవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ప్రకటనలో తెలిపారు.

2,263 మందికి వ్యాక్సినేషన్‌

కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 5: జిల్లాలోని 75 కేంద్రాల్లో 2,263 మందికి  శుక్రవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ప్రకటనలో తెలిపారు. వీరిలో రెవెన్యూ, పీఆర్‌, మున్సిపల్‌ సిబ్బంది 1,710ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లు 553 మంది టీకా వేయించుకున్నారని అన్నారు.

ఒకే ఒక్కటి:  గత 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో ఒక  కేసు నమోదైంది.  మొత్తం కేసులు 60,827కు చేరాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో 43 మంది చికిత్స పొందుతుండగా, 60,296 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2021-02-06T05:29:47+05:30 IST