అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-12-26T06:30:12+05:30 IST

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

 పెనమలూరు, డిసెంబరు 25 : పెనమలూరులో ఓ వ్యక్తి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా మండలి కట్ట వద్ద నివాసం ఉంటున్న పోలగాని నాగరాజు (25) 2019లో అదే ప్రాంతానికి చెందిన అమ్మా యిని ప్రేమించి పెళ్లి చేసుకుని, స్థానికంగా వేరే కాపురం పెట్టాడు. ఈ నెల 24న అతని తండ్రి రాంబాబుతో కలసి కూలీ పనులకు వెళ్లి వచ్చి తన ఇంటికి వెళికలపోయాడు. భార్య పుట్టింటికి వెళ్తానని అడుగగా అందుకు నాగరాజు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో  భార్య పుట్టింటికి వెళికలపోయింది. సమా చారం తెలుసుకుని తండ్రి రాంబాబు కుమారుడి ఇంటికి వెళ్లి చూ డగా చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రాం బాబు ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-26T06:30:12+05:30 IST