వైసీపీ పాలనలో మహిళలపై దాడులు

ABN , First Publish Date - 2021-12-15T06:23:05+05:30 IST

వైసీపీ పాలనలో మహిళలపై దాడులు

వైసీపీ పాలనలో మహిళలపై దాడులు
నారయ్య అప్పారావుపేట సభలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో టీడీపీ నాయకులు

ఉంగుటూరు, డిసెంబరు 14 : వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమౌతున్నాయని, రాష్ట్రంలో దుశ్శాసన పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌ విమర్శించారు. మండలంలోని నారయ్య అప్పారావుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆడపడుచుల ఆత్మగౌరవసభ నిర్వహించారు.

 ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో   టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సతీమణికి జరిగిన అవమానానికి, జగన్‌ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసానికి నిరసనగా ప్రతిగ్రామంలో గౌరవసభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం, ప్రతిపక్షంపై కక్షసాధించటంకోసం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఓటీఎస్‌ పేరుతో లబ్ధిదారులను ఒత్తిళ్లకు గురిచేస్తూ, వారినుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ప్రజాసంక్షేమం ఎక్కడుందని ప్రశ్నించారు.  పార్టీ నాయకులు కొల్లి వెంకటశ్రీనివాసరావు, యర్రంశెట్టి సుబ్బా రావు, వడ్లమూడి అచ్యుతరామయ్య, ముచ్చింతల రాంబాబు, కొల్లి కృష్ణప్రసాద్‌, కోనేరు వరలక్ష్మి, చోడిశెట్టి సామ్రాజ్యం, భారతి,  టీఎన్‌ఎ్‌సఎ్‌ప పార్లమెంటరీ సభ్యులు కోనేరు రాము, యార్లగడ్డ సందీప్‌, పోలిశెట్టి దుర్గారావు, నిమ్మకూరు చంటి, పటేటి యేసురత్నం, నియోజకవర్గ తెలుగుయువత కార్యదర్శి మున్న రామకృష్ణ, మండల టీఎన్‌టీయుసి అధ్యక్షుడు షేక్‌ ఫకీర్‌, గ్రామపార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-15T06:23:05+05:30 IST