యాజమాన్య పద్ధతులతో లాభసాటిగా చెరుకు సాగు

ABN , First Publish Date - 2021-11-09T06:25:36+05:30 IST

యాజమాన్య పద్ధతులతో లాభసాటిగా చెరుకు సాగు

యాజమాన్య పద్ధతులతో లాభసాటిగా చెరుకు సాగు
చెరుకు రైతుల సదస్సులో మాట్లాడుతున్న పున్నారావు, కాశీనాయుడు

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, నవంబరు 8 : సరైన యాజ మాన్య పద్ధతులు పాటిస్తూ చెరుకు సాగు చేయడంలో మెలకువలు పాటిస్తే చెరుకు సాగు లాభసాటిగా ఉంటుందని, కేసీపీ యాజమాన్యం చెరుకు రైతులకు బాసటగా నిలుస్తుందని కేసీపీ జనరల్‌ మేనేజర్‌ వి.వి. పున్నారావు అన్నారు. వీరవల్లిలో కేసీపీ షుగర్స్‌, ఉయ్యూరు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిం చిన చెరుకు రైతుఅవగాహనా సదస్సులో ఆయన పాల్గొన్నారు. 2022-23 సంవత్సర సీజనుకు టన్నుకు రూ.3300తో పాటు రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 100 అదనం గా చెల్లించనున్నట్టు  తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల చెరుకు రైతులతో పాటు ఫ్యాక్టరీలు కూడా నష్టాల బాట పడుతున్నాయని, 99 ఎ53 రకం సాగు చేసిన చెరు కు రైతులకు మొక్క తోటలకు సబ్సిడీపై ఎరువులు అందజేయాలని, రవాణా ఖర్చు  టన్నుకు రూ. 200 పెంచాలని రైతులు కోరారు. సమావేశంలో అడిషనల్‌ మేనేజర్‌ వి.వి.కాశీ నాయుడు, ఫీల్డ్‌మెన్‌లు వెంకట్రావు, యు.వి.ప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.

రైతుకు ఆర్థికసాయం 

   ఉయ్యూరు : సమాజసేవలో రోటరీక్లబ్‌ ముందంజలో ఉంటుందని కేసీపీ జనరల్‌ మేనేజర్‌ వీవీ పున్నారావు అన్నారు. పమిడి ముక్కల మండలం కూడేరు గ్రామానికి చెందిన చెరుకు రైతు కొణతం చలమయ్యకు చెందిన జోడెడ్లలో ఒక ఎద్దు ప్రమాదవ శాత్తు మృతి చెందగా రోటరీ క్లబ్‌ ద్వారా అతనికి సాయంగా రూ. 10వేల చెక్కును క్లబ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అనీస్‌ ద్వారా కేసీపీ కార్యాలయ ఆవరణలో సోమవారం అందజేశారు. కార్యదర్శి నాగ సుబ్రమణ్యం, క్లబ్‌ మాజీ అసిస్టెంట్‌ గవర్నర్‌ సంపత్‌ కుమార్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.   

Updated Date - 2021-11-09T06:25:36+05:30 IST