సైబర్‌ సెక్యూరిటీపై లయోల కళాశాలలో అవగాహన

ABN , First Publish Date - 2021-12-07T06:20:58+05:30 IST

ఆంధ్ర లయోల కళాశాలలో ఐటీ విభాగం, ఏపీఎస్‌ఎస్‌డీ ఆధ్వర్యంలో సోమవారం బేసిక్స్‌ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీపై వర్క్‌షాపు నిర్వహించారు.

సైబర్‌ సెక్యూరిటీపై లయోల కళాశాలలో అవగాహన

 సైబర్‌ సెక్యూరిటీపై లయోల కళాశాలలో అవగాహన 

రామలింగేశ్వర్‌నగర్‌, డిసెంబరు 6 : ఆంధ్ర లయోల కళాశాలలో ఐటీ విభాగం, ఏపీఎస్‌ఎస్‌డీ ఆధ్వర్యంలో సోమవారం బేసిక్స్‌ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీపై వర్క్‌షాపు నిర్వహించారు. ఏపీఎస్‌ఎస్‌డీ ట్రైనర్స్‌ ఆర్‌ రమాదీప్‌, వి. రూపేష్‌ల ఆధ్వర్యంలో ఐటీ విభాగాధిపతి కిషోర్‌బాబు ఆధ్వర్యంలో వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ఎస్‌డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి విషయాలపైన అవగాహన అవసరమని,  సైబర్‌ సెక్యూరిటీపై సదస్సులను నిర్వహించడం అభినందనీయమన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఽఫాదర్‌ బాలస్వామి ఎస్‌జే, ఫాదర్‌ బ్రిట్టోమార్టిన్‌పాల్‌, ఎస్‌జే కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఓ. మహేష్‌లు మాట్లాడుతూ  విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్య అతిథి రమాదీప్‌ తనకున్న అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ప్రస్తుత ఐటీ ఇండస్ర్టీస్‌లో ఎటువంటి అప్లికేషన్స్‌ వాడుతున్నారో తెలియపరిచారు. 

Updated Date - 2021-12-07T06:20:58+05:30 IST