చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి

ABN , First Publish Date - 2021-12-08T06:41:30+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ పోరాడాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి

అప్పటి వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం ఫ పశ్చిమ నియోజకవర్గ టీం టీడీపీ సమావేశంలో వక్తలు

వన్‌టౌన్‌, డిసెంబరు 7 : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ పోరాడాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గ టీం టీడీపీ సమావేశం మంగళవారం జరిగింది. పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెట్టెం రఘురామ్‌, ఎంపీ కేశినేని నాని పిలుపు మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో వైసీపీ అఽధికారంలోకి వచ్చినప్పట్నుంచి మహిళలపై జరుగుతున్న అత్యాచారా లు, అఘాయిత్యాలు, పేదలకు జరుగుతున్న అ న్యాయాలపైన చర్చించారు. సంక్షేమ పథకాల పే రిట చేస్తున్న అన్యాయాలను నేతలు ప్రస్తావించా రు. వీటన్నిటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ శ్రే ణులు ముందుండాలని, 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేవరకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలని పి లుపునిచ్చారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ మ హిళా అధ్యక్షురాలు సుకాసి సరిత ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు, మరుపిళ్ల తిరుమలేష్‌, ప్రధాన కార ్యదర్శి వాసం మునెయ్య, నేతలు పెందుర్తి శ్రీనివాస్‌, మహమ్మద్‌ ఫతావుల్లా, సారిపల్లి రాధాకృష్ణ, నీలం వెంకట నారాయణ, పరిశపోగు రాజేష్‌, మహిళా నేతలు బంకా నాగమణి, షేక్‌ ఆషా, చెన్నుపాటి ఉషారాణి, విజ్జి రమణ మ్మ, మహమ్మద్‌ విజయలక్ష్మి, యేదుపాటి వెంకటరమణి, కొప్పుల హరిత, ఇట్టా భవానీ, లలిత, కప్పంగంతుల శివశర్మ, డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు పి చినసుబ్బయ్య, సుకాశి కిరణ్‌, యేదుపాటి రామయ్య, ధనేకుల సుబ్బారావు, అబ్దుల్‌ ఖాదర్‌, దూది బ్రహ్మయ్య, బొబ్బూరి శ్రీనివాసరావు చౌద రి, మైలపల్లి రాజు, రాంపిళ్ళ మాధవ్‌, విజయశ్రీ, అబ్దుల్‌ హబిబ్‌, పిళ్లా సుదర్శనరావు, సురభి బాలు, కొప్పుల గంగాధరరెడ్డి, సందాక సురేష్‌, చక్రవర్తి, వీరారెడ్డి, ఎర్రా రామారావు, పూజల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులమతాలకతీతంగా కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించిన మైనార్టీ సెల్‌ ప్రధాన కా ర్యదర్శి ఫతావుల్లాను మహిళలు సత్కరించారు.

Updated Date - 2021-12-08T06:41:30+05:30 IST