జీపు జాతాకు స్వాగతం

ABN , First Publish Date - 2021-11-23T05:51:14+05:30 IST

జిల్లా సమగ్రాభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాతాకు విద్యాధ రపురం సితార సెంటర్‌ వద్ద సోమవారం సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు, మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ స్వాగతం పలికారు.

జీపు జాతాకు స్వాగతం
జీపు జాతాకు స్వాగతం పలుకుతున్న జి. కోటేశ్వరరావు

జీపు జాతాకు స్వాగతం 

భవానీపురం, నవంబరు 22 : జిల్లా సమగ్రాభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాతాకు విద్యాధ రపురం సితార సెంటర్‌ వద్ద సోమవారం సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు, మహిళా సమాఖ్య కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ స్వాగతం పలికారు. 

బందర్‌ పోర్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేయాలని, ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఈ జీపు జాతాను ప్రారంభించి విరాళాల సేకరణ చేపట్టారు. నందిగామలో ప్రారంభమైన ఈ జాతాకు స్వాగతం పలికిన సీపీఐ నేతలు విరాళాలను సేకరించారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, చుండూరు వెంకట సుబ్బారావు, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పడమట నరేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరి అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T05:51:14+05:30 IST