దివిసీమ కాల్వలకు నీరు విడుదల

ABN , First Publish Date - 2021-07-12T06:47:35+05:30 IST

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవటమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తెలిపారు.

దివిసీమ కాల్వలకు నీరు విడుదల

మోపిదేవి  : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవటమే రాష్ట్ర ప్రభుత్వ  ఉద్దేశ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తెలిపారు. మోపిదేవివార్పు వద్ద దివిసీమ దిగువకు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఎల్‌.ఎఫ్‌.ఆర్‌ క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు  కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారె సమర్పించారు.  వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, ఇరిగేషన్‌ డీఈ రవికిరణ్‌, ఏఈలు పి.వెంకటేశ్వరరావు, కె.ఎస్‌.జనార్దన్‌, మండల పార్టీ అధ్యక్షుడు శివరాజయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ లింగం జగదీష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. 

నాగాయలంక, కోడూరు కాల్వలకు..

అవనిగడ్డ టౌన్‌  : కేఈబీ కెనాల్‌ నుంచి ఆదివారం అధికారికంగా నీటిని విడుదల చేయటంతో ఇరిగేషన్‌ సిబ్బంది నాగాయలంక, కోడూరు పంట కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. అవనిగడ్డ ఆర్టీసీ బస్సు డిపో వద్ద గల లాకుల వద్ద నుంచి కుడి, ఎడమ కాలువలకు ఒకేసారి నీటిని విడుదల చేశారు. మొత్తం దాదాపు 60 వేల ఎకరాలకు ఈ కాలువల ద్వారా సాగు జరుగుతుందని ఇరిగేషన్‌ డీఈ రవికిరణ్‌ తెలిపారు ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-12T06:47:35+05:30 IST