స్వేచ్ఛగా ఓటు వేయండి
ABN , First Publish Date - 2021-02-06T06:35:13+05:30 IST
ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకో వాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషాలు అన్నారు.

ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా
మోపిదేవి, ఫిబ్రవరి 5 : ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకో వాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషాలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పురస్కరించుకుని శుక్రవారం మోపిదేవిలో అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరుశాతం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. తహసీల్దార్ కె.మస్తాన్, ఎంపీడీవో జె.స్వర్ణభారతి, అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రవికుమార్, వెంకటనారాయణ పాల్గొన్నారు.
పెదప్రోలు, మోపిదేవి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో ఖాజావలి శుక్రవారం పరిశీ లించారు. ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా విద్యుత్, మంచినీటి వసతులు ఏర్పాటు చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు.
చల్లపల్లి :
మోపిదేవి, ఫిబ్రవరి 5 : ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకో వాలని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషాలు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పురస్కరించుకుని శుక్రవారం మోపిదేవిలో అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరుశాతం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. తహసీల్దార్ కె.మస్తాన్, ఎంపీడీవో జె.స్వర్ణభారతి, అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రవికుమార్, వెంకటనారాయణ పాల్గొన్నారు. పెదప్రోలు, మోపిదేవి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో ఖాజావలి శుక్రవారం పరిశీ లించారు. ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా విద్యుత్, మంచినీటి వసతులు ఏర్పాటు చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు.
చల్లపల్లి : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీ సులు ఎల్లప్పుడు అందుబాటులో అప్రమత్తంగా ఉంటారని భరోసా ఇస్తూ శుక్రవారం చల్లపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. పెదప్రోలు నుంచి చల్లపల్లి వరకూ ఈ ఫ్లాగ్ మార్చ్ సాగింది. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా, సీఐలు ఎన్.వెంకట నారాయణ, బి.రవికుమార్, ఎస్సై పి.నాగరాజుతోపాటు సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
