అద్దెల క్రమబద్ధీకరణ

ABN , First Publish Date - 2021-12-31T06:01:10+05:30 IST

సర్వతోముఖాభివృద్ధిగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చే స్తున్నామని మునిసిపల్‌ కమిషర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు.

అద్దెల క్రమబద్ధీకరణ

వాణిజ్య సముదాయాల ద్వారా రూ.26 కోట్ల ఆదాయం 

2022లో రూ.35 కోట్ల వసూలే లక్ష్యం 

25 ఏళ్లు దాటిన వాణిజ్య సముదాయాలకు రీ టెండర్‌ 

2021లో కార్పొరేషన్‌ ప్రగతిని వివరించిన కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌

వన్‌టౌన్‌, డిసెంబరు 30 : సర్వతోముఖాభివృద్ధిగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చే స్తున్నామని మునిసిపల్‌ కమిషర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. గురువారం కార్పొరేషన్‌ ఛాంబర్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ రాయ న భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజ, బె ల్లం దుర్గతో కలసి 2021 ప్రగతిని వివరించారు. నగరంలోని వాణిజ్య సముదాయాల్లోని 3400 షాపులు, 23 కమ్యూనిటీ హాళ్లు, 16 కర్మల భవనాలు, తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి కార్పొరేషన్‌కు 2021 లో రూ.26కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. వీటిని లీ జులకిచ్చి 25 ఏళ్లు కావడంతో అద్దెలను క్రమబద్దీకరించేందుకు రీ టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నా రు. ఈఆర్‌పీ మాడ్యూల్‌ అన్ని షాపుల వివరాలను డాటా ఎంట్రీ చేస్తామన్నారు. అద్దెలు వసూలకు కా ర్పొరేషన్‌లో ప్రత్మేక కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. షాపులు, కల్యాణ మండపాలు నుంచి రెవెన్యూ వసూలును క్రమబద్దీకరించేందుకు మ్యాపింగ్‌ చేస్తున్నామన్నారు. వార్డు పరిపాలనా కార్యదర్శులు తమ పరిధిలోని వాటిని మ్యాపింగ్‌ చేస్తారన్నారు. 2022లో ఎస్టేట్‌ రెవెన్యూ కలెక్షన్‌ను రూ.35 కోట్ల మేర వసూ లు చేయనున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిఽధులు, సీఎండీఎఫ్‌ ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బో ర్డు, ఇరిగేషన్‌ గ్రాంట్‌, వైద్య ఆరోగ్య పద్దు, వీఎంసీ జ నరల్‌ నిధుల కింద మొత్తం 1341 పనులు మంజూరుకాగా రూ.406 కోట్ల 82 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేసి రూ.177 కోట్ల 15 లక్షల విలువైన 813 పనులు పూర్తిచేశామన్నారు. ఇంకా రూ.228కోట్ల 67లక్షల వ్యయంతో 528 పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. కాగా ఆస్తిపన్ను రూ.157,39,28,431కు గాను ఇప్పటివరకు రూ.71,54,35,455 వసూలయ్యాయని, మొత్తంగా 45.46శాతం వసూలయిందన్నారు. ఖాళీస్థలాలపై రూ.176,08,48,252కు గాను 6.23 శా తం మేరకు రూ.10,96,42,374 వసూలయిందన్నారు. నీటిపన్ను రూ.61,54,57,611కు గాను 33.28 శాతం మేరకు రూ.20,48,15,175 వసూలయిందన్నారు.

రానున్న ప్రాజెక్టులు

రానున్న రోజుల్లో వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ రీయూ జ్‌, రాజీవ్‌గాంధీ పార్కులో సిటీ లెవల్‌ ధీమ్‌ పార్కు, రోడ్డు కారిడార్‌ అభివృద్ధి, సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానలింగ్‌ ప్రాజెక్ట్‌, బీసెంట్‌రోడ్డులో షాపర్స్‌ స్ర్టీట్‌, స్పోర్టిం గ్‌ ఎమ్యూజ్‌మెంట్‌ థీమ్‌ పార్కు రానున్నాయన్నారు.

వేగంగా నగరాభివృద్ధి : మేయర్‌ భాగ్యలక్ష్మి

వైసీపీ ప్రభుత్వంలో నగరాభివృద్ధి వేగంగా జరుగుతోందని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కౌన్సి ల్‌ ఏర్పడిన నాటి నుంచి రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీ నివాసరావు, ఎమ్మెల్మే మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ సహకారంతో నగరాభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీ సుకువెళతామన్నారు. డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లందుర్గ మాట్లాడుతూ జనాభా పెరుగుతున్నందున కావాల్సిన వసతులు కల్పించేందుకు కృ షి చేస్తామన్నారు నగర ప్రజలకు ఆహ్లాదంగా ఉం డేందుకు పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-31T06:01:10+05:30 IST