అద్దె గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2021-12-26T06:26:45+05:30 IST

ఎన్‌టీఆర్‌ కాంప్లెక్సులో కొన్ని షాపుల య జమానులు కార్పొరేషన్‌కు అద్దె చెల్లించకుండా ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

అద్దె గోల్‌మాల్‌!

రెండేళ్ల నుంచి అద్దె ఇవ్వని 50 షాపుల యజమానులు

స్థానిక ప్రజాప్రతినిధి, ప్రస్తుత కార్పొరేటర్ల చేతివాటం

ఒక్కోషాపు నుంచి రూ.50వేలు వసూలు చేసి అద్దెలేకుండా చేస్తామని కార్పొరేషన్‌కు గండి

వన్‌టౌన్‌, డిసెంబరు 25 : ఎన్‌టీఆర్‌ కాంప్లెక్సులో కొన్ని షాపుల య జమానులు కార్పొరేషన్‌కు అద్దె చెల్లించకుండా ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. 50 షాపులకు చెందిన యజమానులు రెండేళ్ల నుంచి అద్దె చెల్లించడం లేదని తెలిసింది. అధికారులు సైతం మిన్నకుండి పోవడానికి కారణమేమిటో తెలియరాలేదు. దీంతో కా ర్పొరేషన్‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 2016 ఏప్రిల్‌ 19న రెండు, మూడు అంతస్తుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2019లో టెండర్లు పిలిచారు. రెం డో ఫ్లోర్‌లో 106 దుకాణాలుండగా, మూడో ఫ్లోర్‌లో ఫో క్సో కోర్టు, సీఎంఎం కోర్టులు మాత్రమే నడుస్తున్నాయి. మిగతా షాపులన్నీ ఖాళీనే. ఒక్కోషాపు అద్దె రూ.6వేల నుంచి రూ.20వేల వరకు ఉంది. అయితే రెండో ఫ్లోర్‌లో 50 షాపులకు చెందిన యజమానులు రెండేళ్ల నుంచి అద్దె డబ్బులివ్వడం లేదు. అదేమంటే అది లేదు ఇది లేదు, లిఫ్ట్‌ సౌకర్యం ఉన్నా లేదంటూ కుంటి సాకులు చెబుతున్నారు. సేకరించిన సమాచారం మేరకు ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ కా ర్పొరేటర్‌ కుమ్మక్కై షాపుల వారి నుంచి రూ.50వేల చొ ప్పున వసూలు చేసి, అద్దె లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్‌లో తీర్మానం కూడా పెట్టారు. దీం తో దాదాపు రూ.35లక్షల మేరకు ఆదాయం కోల్పోవటంపై విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు. 

ప్రక్షాళన చేపడతాం..

ఎన్‌టీఆర్‌ కాంప్లెక్స్‌పై నూతనంగా నిర్మించిన దుకాణాలను పాడుకున్న వ్యాపారస్థులకు, అధికారులకు మధ్య సమన్వయం లోపించిందని ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. షాపుల వ్యవహారంపై కొద్దిరోజుల్లో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని, అద్దెల బకాయిల వ్యవహారాన్ని పరిశీలించి ఒక కొలిక్కి తీసుకువస్తామని తెలిపారు. 

Updated Date - 2021-12-26T06:26:45+05:30 IST