స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-01-13T06:18:52+05:30 IST

స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి

స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తి
శివాలయం సెంటర్‌ వద్ద జయంతిలో అనూష

జి.కొండూరు, జనవరి 12: స్వామి వివేకానంద జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వివే కానంద యువజన సమాఖ్య అధ్యక్షుడు చన మోలు రామచంద్రరావు (రాము) సూచించారు. వివేకానంద జయంతి సందర్భంగా జి.కొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో సమాఖ్య అధ్వర్యంలో క్రీడలు నిర్వహించి, విజేతలకు ఆయన బహు మతులు అందించారు. పీడీ ఆర్‌.సీజర్‌రెడ్డి, సమాఖ్య సభ్యులు చల్లా ప్రవీణ్‌, జి.చంద్రశేఖర్‌, రవి, బాబి, సాయి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఫ విద్యాధరపురం : భవానీపురం శివాలయం సెంటర్‌ వద్ద మంగళవారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ 42వ డివిజన్‌ అభ్యర్థి తిరుపతి అనూష, హిందూ చైతన్య వేదిక సభ్యులు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని నివాళులర్పించారు. 

పెనమలూరు: జాతీయ యువజన దినోత్స వాన్ని పురస్కరించుకుని కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్‌ పాఠశాలలో మంగ ళవారం వేడుకలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా వివేకానందునిపై ప్రత్యేక క్విజ్‌ను నిర్వహించారు. వివేకానందుడు చికాగో చేసిన ఉపన్యాసాన్ని విద్యార్ధులు ప్రదర్శన ద్వారా విని పించారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాల కన్వీనర్‌ వీరపనేని శశికళ, ప్రిన్సిపాల్‌ కె. శ్రీహరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ కంకిపాడు : విద్యార్థి వికాస వాహిని ఆధ్వ ర్యంలో మంగళవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వకృత్వ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి కేశవరావు, అన్నమనేని శ్రావణి, చంద్రిక తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T06:18:52+05:30 IST