విశ్వబ్రాహ్మణులకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-24T06:09:13+05:30 IST

విశ్వ బ్రాహ్మణులందరికీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కార్పొరేషన్‌ డైరెక్టర్లకు చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌ సూచించారు.

విశ్వబ్రాహ్మణులకు అండగా ఉండాలి

  ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌  శ్రీకాంత్‌

వన్‌టౌన్‌, మే 23 : కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులందరికీ  అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కార్పొరేషన్‌ డైరెక్టర్లకు చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌ సూచించారు. శ్రీకాంత్‌ ఆదివారం 12 మంది డైరెక్టర్లతో జూమ్‌ మీటింగ్‌లో రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల స్థితిగతులపై చర్చించారు. స్ధానిక ప్రజా ప్రతినిధులతో సమన్వ యం చేసుకొని కరోనా బారినపడిన విశ్వబ్రాహ్మణులకు   మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.   తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను గుర్తించి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందేలా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని తెలిపారు. కర్ఫ్యూలో కుల వృత్తులు  చేయలేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వ  ఆర్థిక సహాయం అందేలా బీసీ  సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు.  తొలుత ఇటీవల శివైక్యం చెందిన వీరబోగ వసంత వెంకటే శ్వరస్వామి, కరోనా బారిన పడి మృతి చెందిన  సంఘీయులకు నివాళులర్పించారు.


Updated Date - 2021-05-24T06:09:13+05:30 IST