గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించటం లేదు

ABN , First Publish Date - 2021-08-21T06:12:30+05:30 IST

గ్రామాభివృద్ధి అధికారులు సహకరించటం లేదని పెదపారుపూడి సర్పంచ్‌ చప్పిడి సమీరా ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించటం లేదు
పెదపారుపూడిలో అసంపూర్తిగా ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డు

పెదపారుపూడి సర్పంచ్‌ సమీరా ఆవేదన

పెదపారుపూడి : గ్రామాభివృద్ధి అధికారులు సహకరించటం లేదని పెదపారుపూడి సర్పంచ్‌ చప్పిడి సమీరా ఆవేదన వ్యక్తం చేశారు.  పెదపారు పూడిలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సొంత నిధులు సుమారు రూ.నాలుగు లక్షలతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. నెలలు గడు స్తున్నా బిల్లులు రావటం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కార్యాలయం చుట్టూ పదే పదే తిరిగినా పట్టించుకోవ టంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి స్వచ్ఛ అవార్డు అందుకున్న ఎస్‌డబ్ల్యూ పీసీ  (డంపింగ్‌ యార్డు) ప్రస్తుతం నిరుపయోగంగా మారిం దన్నారు.  సహకరించా లని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవటంలేదన్నారు. దళిత సర్పంచ్‌నని అధికా రులు చులకనగా చూస్తున్నారని వాపోయారు. Updated Date - 2021-08-21T06:12:30+05:30 IST