ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-10-14T15:26:18+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు మహిషాసుర మర్దనిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు.


ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు అష్టబుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మ నిజ స్వరూపం కూడా ఇదే కావడం విశేషం. కాగా శుక్రవారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది.



Updated Date - 2021-10-14T15:26:18+05:30 IST