ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-05-05T13:50:21+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో కొండపై ముగ్గురు మృతి చెందారు.

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో కొండపై ముగ్గురు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఎన్‌ఎమ్‌ఆర్‌గా పనిచేస్తున్నఆకుల హరి మృతి చెందగా, నిన్న ఆలయ అర్చకులు రాఘవయ్య మృతి చెందారు. నాలుగు రోజుల క్రితమే ఓ అర్చకుడు కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కరోనాతో పలువురు ఉద్యోగులు బాధపడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో నేటి నుంచి అమ్మవారి దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.