Vijayawada: చెత్త ట్రాన్ప్ఫార్మర్‌ స్టేషన్‌ను సందర్శించిన సీపీఎం నేత

ABN , First Publish Date - 2021-10-25T17:28:02+05:30 IST

నగరంలోని అజిత్ సింగ్ నగర్‌లోని చెత్త ట్రాన్స్ఫార్మర్ స్టేషన్‌ను సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్ బాబూరావు సందర్శించారు.

Vijayawada: చెత్త ట్రాన్ప్ఫార్మర్‌ స్టేషన్‌ను సందర్శించిన సీపీఎం నేత

విజయవాడ: నగరంలోని అజిత్ సింగ్ నగర్‌లోని చెత్త ట్రాన్స్ఫార్మర్ స్టేషన్‌ను సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్ బాబూరావు సందర్శించారు. జనావాసాల మధ్య వందల టన్నుల చెత్త ఉంచడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు పదవులపై ఉన్న వ్యామోహం ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. కరోనా, డెంగ్యూ , మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నాయని ఇళ్ల మధ్య ఎందుకు ఉంచుతున్నారని సీహెచ్ బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-25T17:28:02+05:30 IST