Vijayawada: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-09T18:20:15+05:30 IST

నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.

Vijayawada: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

విజయవాడ: నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిలు సిడి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, రాష్ట్ర  అధ్యక్షులు సాకే శైలజనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి జే.డీ శీలం మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపేందుకు పోటీ పడుతున్నాయని విమర్శించారు. ఏపీలో రాక్షస పాలనకు చరమ గీతం పలకాలని ప్రజలు ఎదురు‌ చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలకు విస్తృతంగా తీసుకెళతామని చెప్పారు. 


మాజీ కేంద్ర మంత్రి డా.చింతా మోహన్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను సంపన్నులకు దోచిపెడుతోందని ఆరోపించారు. అభివృద్ధి అరుంధతి నక్షత్రంలా మారిందన్నారు. రాష్ట్రంలో సంక్రాంతిలోపు 80 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లను పునరుద్ధరించాలని అన్నారు. 

Updated Date - 2021-11-09T18:20:15+05:30 IST