అందరి కృషి ఫలితమే స్వచ్ఛ అవార్డు

ABN , First Publish Date - 2021-11-23T05:58:09+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలో విజయవాడ నగరం మూడో ర్యాంక్‌ సాధించిందని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు.

అందరి కృషి ఫలితమే స్వచ్ఛ అవార్డు
మాట్లాడుతున్న మేయర్‌ భాగ్యలక్ష్మి, పక్కనే కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌

అందరి కృషి ఫలితమే స్వచ్ఛ అవార్డు

మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, నవంబరు 22: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలో విజయవాడ నగరం మూడో ర్యాంక్‌ సాధించిందని మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ ర్యాంక్‌ నగర ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు, కార్మికుల సమష్టి కృషి ఫలితమన్నారు. ఇదే స్ఫూర్తి రానున్న రోజులలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించేలా ప్రజలు అధికారులు, కార్మికులు ముందుకు సాగాలన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 సంవత్సరానికి పరిశుభ్ర నగరంగా విజయవాడ మూడో స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

రాష్ట్రపతి రామ్‌నాఽథ్‌ కోవింద్‌ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారన్నారు. కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్ధ అందిస్తున్న పౌరసేవలు, పారిశుధ్యంపై  ప్రజల అభిప్రాయాలు, చెత్త సద్వినియోగంలో పాటించిన ప్రమాణాల ఆధారంగా ర్యాంక్‌ ఇస్తారన్నారు. స్వచ్ఛత యాప్‌ వినియోగంలో, బయోవేస్ట్‌ సద్వినియోగంలోనూ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ, బెల్లం దుర్గ, నగరపాలక సంస్థ చీఫ్‌ మెడికల్‌ అధికారిణి గీతాభాయ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ప్రభాకరరావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-11-23T05:58:09+05:30 IST