AP: 11వ రోజుకు ఎస్‌జీఎస్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-15T16:33:47+05:30 IST
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన 11వ రోజుకు చేరుకుంది.

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన 11వ రోజుకు చేరుకుంది. ఎయిడెడ్ కళాశాలలు కొనసాగించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు నందిగామ కేవీఆర్ కళాశాల వద్ద నిన్న విద్యార్థులపై జరిగిన దాడిని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటలో ఎస్‌జీఎస్ కళాశాలను ఎయిడెడ్‌గా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.