కృష్ణా జిల్లాలో పల్టీ కొట్టిన ఆటో... వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-11-26T19:10:21+05:30 IST

కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ శివారు దేవసముద్రం వద్ద కూలీలతో వెళ్తున్న ఓ ఆటో పల్టీలు కొట్టింది.

కృష్ణా జిల్లాలో పల్టీ కొట్టిన ఆటో... వ్యక్తి మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ శివారు దేవసముద్రం వద్ద కూలీలతో వెళ్తున్న ఓ ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా...పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. మృతుడు మండలంలోని ఎరుకోపాడు గ్రామానికి చెందిన కొంగల సుబ్బారావుగా గుర్తించారు. 

Updated Date - 2021-11-26T19:10:21+05:30 IST