ఈ ‘విజయ’ం పాడి రైతులకు అంకితం

ABN , First Publish Date - 2021-08-20T06:48:55+05:30 IST

అత్యధిక మెజారిటీతో గెలిపించిన పాల ఉత్పత్తి సంఘాల అధ్యక్షుల ద్వారా పాడి రైతులకు తన విజయాన్ని అంకితం చేస్తున్నట్లు విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయు లు అన్నారు.

ఈ ‘విజయ’ం పాడి రైతులకు అంకితం
ఆంజనేయులను సత్కరిస్తున్న డెయిరీ సిబ్బంది

డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు 

హనుమాన్‌జంక్షన్‌, ఆగస్టు 19 : అత్యధిక మెజారిటీతో గెలిపించిన పాల ఉత్పత్తి సంఘాల అధ్యక్షుల ద్వారా పాడి రైతులకు తన విజయాన్ని అంకితం చేస్తున్నట్లు విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయు లు అన్నారు. విజయ డెయిరీ డైరెక్టర్స్‌ ఎన్నికల్లో విజ యం సాధించిన సందర్భంగా గురువారం తన నివాసంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. పాడి రైతు  సంక్షేమం కోసం రెండున్నరేళ్లు ఎన్నో సంక్షేమ పథకా లు అమలు చేశామన్నారు. రేయింబవళ్లు గ్రామగ్రామాన తిరిగి పాడిరైతుల్లో ఉత్సాహాన్ని నింపడం వల్లే పాలఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. పాలసంఘాల సహకారం మరువలేనిదన్నారు. తనతో పాటు పాల సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది, సహకారంతోనే కృష్ణామిల్క్‌ యూనియన్‌ను అభిృవృద్ధి పథంలో నడిపిస్తున్నామరు. తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని త్వరలో పాలధర లీటరు రూ.100కు పెంచాలనే లక్ష్యంతోపాటు జంక్షన్‌ ప్రాంతంలో మరో పాలఫ్యాక్టరీ నిర్మాణం చేయాలనే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేశారని, వ్యక్తిగత విమర్శలు కూడా చేశారన్నారు. ఒక వ్యవస్థపై బురద జల్లడానికి కొంతమంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. విజయమే వారికి సమాధానం చెప్పిందన్నారు. పూర్తి అకౌంట్‌బులిటీతో పనిచేస్త్తున్నట్లు చెప్పారు. తనమీద నమ్మకంతో డైరెక్టర్‌గా గెలిపించిన పాల సంఘాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. పాలసంఘాల అధ్యక్షులు, విజయ డెయిరీ ఉద్యోగులు, సిబ్బంది చలసానికి పూలమాలలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత చలసాని హనుమాన్‌జంక్షన్‌లోని అభయాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి అర్చకుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. 

Updated Date - 2021-08-20T06:48:55+05:30 IST