విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-11-02T06:43:36+05:30 IST

విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి

విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
వర్క్‌షాప్‌ ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తున్న కవితారాణి

ఏపీఎస్‌ఎస్‌డీసీ టెక్నికల్‌ టీమ్‌  కో-ఆర్డినేటర్లు కవితారాణి, నందిని

ఉంగుటూరు, నవంబరు 1 : మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యార్ధులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, ఐవోటీ, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ పొందిన విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీఎస్‌ఎస్‌డీసీ టెక్నికల్‌ టీమ్‌ కో-ఆర్డినేటర్లు కె.కవితారాణి, సీహెచ్‌ నందిని అన్నారు. ఉంగుటూరు మండలం, తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాల, ఈసీఈ విభాగం, ఏపీఎస్‌ఎస్‌డీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఐవోటీ,పైథాన్‌ ప్రోగ్రామింగ్‌పై విద్యార్థులకు ఆరు రోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌ (కార్యశాల)సోమవారం కళాశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోఆర్డినేటర్లు మాట్లాడుతూ కార్యశాలల్లో అనుభవజ్ఞులు ఇచ్చే శిక్షణద్వారా విద్యార్ధులు ఆయా అంశాలపై పూర్తి పట్టుసాధించాలని, సమగ్రవిషయపరిజ్ఙానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈసీఈ విభాగాధిపతి బత్తుల నాంచారయ్య మాట్లాడుతూ ఆటోమేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌. మెషిన్‌లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌ రంగాల్లో ఐవోటీ, పైథాన్‌ ప్రోగ్రామ్‌లు ప్రముఖపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌   ప్రసాద్‌ మాట్లాడుతూ పరిశ్రమల్లో వచ్చే కొత్త టెక్నాలజీపై ముందుగానే అవగాహన కలిగి, ఉద్యోగనియామక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కార్యశాలలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కళాశాల చైర్మన్‌ సుంకర రామబ్రహ్మం, వర్క్‌షాప్‌ను సందర్శించి శిక్షణ పొందుతున్న విద్యార్థులను అభినందించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ  టెక్నికల్‌ టీమ్‌ ప్రతినిధులు, కళాశాల డైరెక్టర్‌ కె. రాజశేఖరరావు, కో- ఆర్డినేటర్లు ప్రసాద్‌, సురేంద్ర పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-02T06:43:36+05:30 IST