బాడీబిల్డింగ్‌లో కేబీఎన్‌ విద్యార్థి ప్రతిభ

ABN , First Publish Date - 2021-08-20T05:56:42+05:30 IST

కాకరపర్తి భవనారాయణ (కేబీఎన్‌) కళాశాల విద్యార్థి పి.వెంకట గోపాల్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రజిత పతకాన్ని సొంతం చేసుకున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ తెలిపారు.

బాడీబిల్డింగ్‌లో కేబీఎన్‌ విద్యార్థి ప్రతిభ
వెంకట గోపాల్‌ను అభినందిస్తున్న కళాశాల కమిటీ ప్రతినిధులు, ప్రిన్సిపాల్‌ తదితరులు

బాడీబిల్డింగ్‌లో కేబీఎన్‌ విద్యార్థి ప్రతిభ

వన్‌టౌన్‌, ఆగస్టు 19 : కాకరపర్తి భవనారాయణ (కేబీఎన్‌) కళాశాల విద్యార్థి పి.వెంకట గోపాల్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రజిత పతకాన్ని సొంతం చేసుకున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ తెలిపారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అంతర్‌ జిల్లాల బాడీ బిల్డింగ్‌ పోటీల్లో తమ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.వెంకటగోపాల్‌ పలు విభాగాల్లో పోటీపడ్డారని పేర్కొన్నారు. ఓవరాల్‌గా రజిత పతకాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, తూనుకుంట్ల శ్రీనివాస్‌, కోశాధికారి అన్నం రామకృష్ణారావులు విద్యార్థి వెంకటగోపాల్‌ను, అతనిని తీర్చిదిద్దిన క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావును అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T05:56:42+05:30 IST