ఓ మంచి స్నేహితుడు ఎవరయ్యా అంటే...: వెంకయ్య

ABN , First Publish Date - 2021-10-31T17:13:08+05:30 IST

ఓ మంచి స్నేహితుడు ఎవరయ్యా అంటే... మంచి పుస్తకం అని పెద్దలు చెప్పేవారని వెంకయ్య అన్నారు.

ఓ మంచి స్నేహితుడు ఎవరయ్యా అంటే...: వెంకయ్య

విజయవాడ: ఓ మంచి స్నేహితుడు ఎవరయ్యా అంటే... మంచి పుస్తకం  అని పెద్దలు చెప్పేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనలో భాగంగా నిన్న విజయవాడకు వచ్చిన ఆయన ఆదివారం సంఘ సంస్కర్త  రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వందేళ్లుగా ఈ గ్రంథాలయం నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. తన చిన్నతనంలో రామ్మోహన్ గ్రంధాలయం ఒక ప్రముఖ ప్రాంతంలో ఉండేదని, సమావేశాలకు సభలకు తన చిన్నతనంలో ఇక్కడకు వచ్చి ఉపన్యాసం చేసేవాడినని చెప్పారు. ప్రాచీన గ్రంథాలు, మహానీయుల చరిత్రలు, లాంటి ఎన్నో గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉంటాయన్నారు. ఉక్కు మనిషి, సమైక్య భారతావనికి కృషిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు ఇక్కడికి రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.‌ గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలని ఆకాంక్షించారు. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదని, పుస్తకం అందరి చేతిలో ఉండాలని, పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Updated Date - 2021-10-31T17:13:08+05:30 IST