మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్‌

ABN , First Publish Date - 2021-05-09T04:54:18+05:30 IST

మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్‌

మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిపిస్తే వాహనం సీజ్‌
శనివారం మధ్యాహ్నం ఖాళీగా బందరురోడ్డు

విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి) : రోజూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నా చిన్నచిన్న కారణాలతో బయటకు వస్తు న్నారా? వీధుల నుంచి ప్రధాన రహదారుల వరకు రోడ్డుపైనే కూర్చుని  మాట్లాడుకుంటున్నారా? ఆదివారం నుంచి ఇలాంటి పనులకు చెక్‌. ఇకపై మధ్యాహ్నం 12 గంటల తర్వాత అకారణంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే రహదారులపై సంచరించడానికి సడలింపు ఉందని, ఆ తర్వాత అత్యవసరాలకే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-09T04:54:18+05:30 IST