విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

ABN , First Publish Date - 2021-08-20T06:01:55+05:30 IST

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మండలంలో కంభంపాడులో గురువారం జరిగింది.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

వత్సవాయి, ఆగస్టు 19 : విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మండలంలో కంభంపాడులో గురువారం జరిగింది. పాత వేమవరానికి చెందిన జొన్నలగడ్డ వీరబాబు (47)కు కంభంపాడు గ్రామ పరిధిలోని సొంత భూమిలో కూలీలతో వ్యవసాయ పనులు చేయిస్తున్నాడు. కూలీలకు ఆహారం ఇచ్చి మంచినీటి కోసం మోటారు వద్దకు వెళ్లి స్విచ్‌ వేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. కూలీలు గమనించి మోటారు వద్దకు వచ్చేసరికి పడిపోయాడు. అతడిని స్థానిక ప్రైవేట్‌ వైద్యుడికి వద్దకు తీసుకెళ్లగా మృతి చెందినట్టు చెప్పారు. మృతుడి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇటీవల వివాహం చేశాడు. కుమారుడు, మరో కుమార్తె చదువుకుంటున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరబాబు కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రైతు సంఘ నేత చిరుమామిళ్ల హనుమంతురావు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-08-20T06:01:55+05:30 IST