11, 12 తేదీల్లో వాసవీ క్లబ్స్ అంతర్జాతీయ సదస్సు
ABN , First Publish Date - 2021-12-09T05:52:25+05:30 IST
ఈనెల 11, 12వ తేదీల్లో వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి అంతర్జాతీయ సదస్సును పోరంకిలోని మురళీ రిసా ర్ట్స్లో నిర్వహించ నున్నా మని, వివిధ రాష్ట్రాల నుంచి వాసవీ క్లబ్ సభ్యులు హాజరవుతారని వాసవీ క్లబ్స్ అధ్యక్షుడు తిరువీధి వేణుగోపాల్ తెలియజేశారు.

11, 12 తేదీల్లో వాసవీ క్లబ్స్ అంతర్జాతీయ సదస్సు
పాయకాపురం, డిసెంబరు 8 : ఈనెల 11, 12వ తేదీల్లో వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి అంతర్జాతీయ సదస్సును పోరంకిలోని మురళీ రిసా ర్ట్స్లో నిర్వహించ నున్నా మని, వివిధ రాష్ట్రాల నుంచి వాసవీ క్లబ్ సభ్యులు హాజరవుతారని వాసవీ క్లబ్స్ అధ్యక్షుడు తిరువీధి వేణుగోపాల్ తెలియజేశారు. ఈ మేరకు రాజీవ్‌నగర్‌లోని వాసవీ క్లబ్ కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించి, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొలుసు పార్ధసారథిలు పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం అంతర్జాతీయ అధ్యక్షుడు, కన్వెన్షన్ సలహాదారుడు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొనే వారు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలని తెలిపారు. మాజీ అధ్యక్షుడు, సలహాదారు తాడిపత్రి వెంకట్రావు, వరలక్ష్మి, మామిడి శ్రీనివాసరావు, రేణిగుంట్ల శ్రీనివాస్, సంతోష్, బొడ్డు శ్రీనివాస్ పాల్గొన్నారు.