దళిత వర్గాలకు ఏం చేశారో చెప్పండి : వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-12-25T06:39:35+05:30 IST

దళిత వర్గాలకు ఏం చేశారో చెప్పండి : వర్ల రామయ్య

దళిత వర్గాలకు ఏం చేశారో చెప్పండి : వర్ల రామయ్య

విద్యాధరపురం, డిసెంబరు 24 : దళిత వర్గాలకు సీఎం జగన్‌ ఏం చేశారో చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సవాల్‌ విసిరారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. అమరావతిలో 120 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్ణయాన్ని భూస్థాపితం చేశారని మండిపడ్డారు. స్వరాజ్యమైదానంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ ముఖ్యమంత్రి వల్ల కాదన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఏప్రిల్‌ 14 నాటికి ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. స్మృతివనానికి కేటాయించిన రూ.100 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. 

Updated Date - 2021-12-25T06:39:35+05:30 IST