అహంవీడి, పేదవాని క్షుద్బాధ తీర్చండి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-05-20T19:06:52+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అహంవీడి, పేదవాని క్షుద్బాధ తీర్చండి: వర్ల రామయ్య

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఓ ప్రక్క కరోనా విలయ తాండవం, మరో ప్రక్క, బ్లాక్ ఫంగస్ విజృంభణ, ఇంకోపక్క, పేదవాని ఆకలి కేకలు. రోజువారీ కూలీల అవస్థలు. వాస్తవిక పరిస్థితులు గమనించి, "ఇగో"కు , పట్టుదలలకు పోకుండా, మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరవండి. అహంవీడి, పేదవాని క్షుద్బాధ తీర్చండి’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.Updated Date - 2021-05-20T19:06:52+05:30 IST