వరినాట్లు ముమ్మరం
ABN , First Publish Date - 2021-08-03T05:58:24+05:30 IST
వరినాట్లు ముమ్మరం

హనుమాన్‌జంక్షన్, ఆగస్టు 2 : బాపులపాడు మండలంలో ముమ్మ రంగా వరి నాట్లు సాగుతున్నాయి. మండలంలో 7,125 హెక్టార్లు వరి సాధా రణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 3, 200 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. ఈ ఏడాది సాగునీరు ఆలస్యంగా విడుదల చేయడంతో రైతులు వెద జల్లుడు చేపట్టారు. ఈ రకంగా మండలంలోని పలు గ్రామాల్లో 1100 హెక్టార్లలో వెద సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల తో పాటు కాలువ కు నీరు విడుదల చేయడంతో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇటీవల ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలో కురిపి రాల, బొమ్ములూరు, ఓగిరాల, బండారు గూడెం గ్రామాల్లో వెద వ్యవసాయం నీటి మునిగి రైతులు నష్టపోయారు. ఈ రకంగా మండలంలో 75 హెక్టార్లలో వెద వ్యవసాయం నష్టపోయిందని మండల వ్యవసాయాధికారి జె. భవానీ తెలిపారు. నష్టపోయిన రైతులంతా మళ్లీ వరి నాట్లు వేసుకోవాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
కూలీలపై వెద ప్రభావం
సాగునీరు ఆలస్యంగా విడుదల చేయడంతో రైతాంగం చేపట్టిన వెద సాగు కూలీలపై ప్రభావం చూపింది. పని కొరతను సృష్టించింది. రైతులు ఖర్చులు తగ్గించుకోవడానికి వెదసాగు చేయడంతో కూలీలకు పని తగ్గిపోయింది.