వంగవాటి రాధాను కలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...

ABN , First Publish Date - 2021-12-26T19:30:18+05:30 IST

బెజవాడ పాలిటిక్స్‌లో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది.

వంగవాటి రాధాను కలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...

విజయవాడ: బెజవాడ పాలిటిక్స్‌లో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మద్దతుదారుగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అకస్మాత్తుగా వంగవీటి రాధాను కలవడం హాట్ టాఫిక్‌గా మారింది. రాధా కార్యాలయంలో ఇద్దరూ కొద్దిసేపు భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రాహానికి రాధా, వంశీ ఇద్దరూ పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత సభలో పాల్గొన్నారు. ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రంగా ఆశయ సాధన కోసం పోరాడతామని రాధా అన్నారు.


ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు.. గుర్తుండే వ్యక్తులు ముగ్గురని అన్నారు. ఎన్టీరామారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా అని అన్నారు.


జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వంగవీటి రంగా ప్రజలు, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలు ఎప్పటికి మరువలేనివని అన్నారు. ప్రతి ఊరులో వంగవీటి రంగా విగ్రహాలు ఉంటాయని, కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని పోతిన మహేష్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-12-26T19:30:18+05:30 IST