కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

ABN , First Publish Date - 2021-10-21T06:29:17+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు
వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో కొడాలి అనురాధ

కంకిపాడు, అక్టోబరు 20 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహ లను తొలగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునే విధంగా వలంటీర్లు కృషి చేయాలని కంకిపాడు ఎంపీడీవో కొడాలి అనురాధ అన్నారు. మండల కేంద్రమైన కంకిపాడుతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో పలు ఇబ్బందులు వస్తున్నాయని పలు వురు వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నా రన్నారు.  వ్యాక్సిన్‌ వేయిం చుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవ ని, కరోనా వచ్చినా తట్టుకునే శక్తి ఉం టుందన్నారు. ప్రతిఒక్కరూ తప్ప కుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఈవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:29:17+05:30 IST