వ్యాక్సినేషన్‌పై అవగాహన పెరగాలి

ABN , First Publish Date - 2021-06-21T06:03:47+05:30 IST

వ్యాక్సినేషన్‌పై అవగాహన పెరగాలి

వ్యాక్సినేషన్‌పై అవగాహన పెరగాలి
బాపులపాడు జడ్పీ పాఠశాలలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న డీఎండ్‌హెచ్‌వో సుహాసిని

 హనుమాన్‌జంక్షన్‌, జూన్‌ 20 : కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నేప థ్యంలో కూడా  చాలా మంది టీకా వేసుకోవడానికి ఇంకా వెనుకా డుతున్నారని ప్రజల్లో  అపొహాల్ని  తొలగించి 45 ఏళ్లు పైబడిన వారంతా  టీకా వేసుకునే విధంగా  ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు పనిచేయాలని  జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి  సుహాసిని అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌లో  భాగంగా బాపులపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఆమె సందర్శించారు. 

ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపులపాడు పీహెచ్‌సీ  వైద్యాధికారి మంజూష వాక్సినేషన్‌ తీరును వివరించారు. బాపులపాడులో మూడు సచివాలయాల్లో నిర్వహిం చిన వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో స్పందన బాగుందని  సర్పంచ్‌ సరిపల్లి కమలాబాయి, వైసీపీ నేత దుట్టా శివన్నారాయణ తెలిపారు.  డీఎం అండ్‌ హెచ్‌వో  వెంట  వైద్యవిభాగం  జిల్లా డైరెక్టర్‌ గీతా ప్రసాదినీ,   స్టేట్‌ మానిటరింగ్‌ అధికారి సుబ్రహ్మ ణ్యం, అడిషనల్‌ డీఎం అండ్‌ హెచ్‌వో ఉషారాణి, డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో ఆశ  ఉన్నారు. 

 ఫ ఉంగుటూరు  : వైద్యసిబ్బంది, అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి ప్రతిగ్రామాన్ని కొవిడ్‌ రహితంగా మార్చాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ గీతాప్రసాదిని అన్నారు. కొవిడ్‌టీకా మెగా డ్రైవ్‌లో భాగంగా ఆదివారం పెదఅవుటపల్లి పీహెచ్‌సీ, గ్రామసచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీవర్‌సర్వే పకడ్బందీగా చేయటం ద్వారా గ్రామాల్లో కొవిడ్‌ నియంత్రణ సాధ్యమౌతుందన్నారు.  పీహెచ్‌సీ వైద్యాధికారిణి   బి. శిరీష, హెల్త్‌సూపర్‌వైజర్‌ పి.,శ్రీనివాసరావు, సర్పంచ్‌ బాణా వతుల తిరుపతమ్మ,  కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:03:47+05:30 IST