ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-10-25T06:01:57+05:30 IST
ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి

జిల్లా ఉప వైద్యాధికారి ఇందుమతి
కంకిపాడు, అక్టోబరు 24 : ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ తప్పనిసరని, వ్యాక్సి నేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా ఉప వైద్యాధికారి ఇందుమతి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇందుమతి మాట్లాడు తూ కరోనా వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకునే విధంగా చర్యలు తీసుకుం టున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొడాలి అనురాధ, మండల వైద్యాధికారి సుందర్, హెల్త్ అసిస్టెంట్లు శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.