ఆరు సర్పంచ్‌లు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-02-06T06:15:52+05:30 IST

ఆరు సర్పంచ్‌లు ఏకగ్రీవం

ఆరు సర్పంచ్‌లు ఏకగ్రీవం

గుడివాడ.  ఫిబ్రవరి 5: డివిజన్‌లోని ఆరు గ్రామాల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. తొమ్మిది మండలాల్లోని ఆరు గ్రామాల్లో ఒక నామినేషనే దాఖలు చేయడంతో ఏకగ్రీవం ఖాయమైంది. నామినేషన్ల పరిశీలన అనంతరం రెండు సెట్లు నామినేషన్లు వేసిన వారిది ఒక సెట్‌ మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో మండవల్లి మండలంలోని సింగనపూడిలో బొమ్మలబోయిన కనకదుర్గ(వైసీపీ సానుభూతిపరురాలు), పుట్లచెరువులో గురుగుబెల్లి వెంకటేశ్వరరావు(వైసీపీ సానుభూతిపరుడు), గన్నవరంలో గుడివాడ శ్రీదేవి(వైసీపీ సానుభూతిపరురాలు) కేవలం ఒకే నామినేషన్‌ దాఖలు చేశారు. గతంలో వీరి కుటుంబ సభ్యులే ఆయా గ్రామాల సర్పంచ్‌లుగా వ్యవహరించడం విశేషం. పెదపారుపూడి మండలంలో రావులపాడు గ్రామ పంచాయతీకి గోళ్ల సోమేశ్వరరావు(వైసీపీ సానుభూతిపరుడు) ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. కేవలం ఒక నామినేషన్‌ దాఖలు చేయడంతో గుడివాడ మండలంలోని దొండపాడులో చోరగుడి సురేఖ(టీడీపీ సానుభూతిపరురాలు), నందివాడ మండలంలోని పొణుకుమాడులో అరుణ(వైసీపీ సానుభూతి పరురాలు) గురువారమే ఏకగ్రీవమైన విషయం విదితమే. 


Updated Date - 2021-02-06T06:15:52+05:30 IST