దేవినేని ఉమా అరెస్టు అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-01-20T06:48:03+05:30 IST

శాంతియుతంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీమంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయటం అప్రజాస్వామిక చర్య అని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవినేని ఉమా అరెస్టు అప్రజాస్వామికం
అవనిగడ్డలో నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు

అవనిగడ్డ టౌన్‌, జనవరి 19 : శాంతియుతంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీమంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయటం అప్రజాస్వామిక చర్య అని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన ఉమాను శాంతి భద్రతల పేరుతో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అవనిగడ్డలో ప్రదర్శన నిర్వహించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం సిగ్గుచేటని, దీనికి త్వరలోనే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, సమ న్వయ కమిటీ సభ్యులు  కొల్లూరు వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, బండె రాఘవ, మండవ బాలవర్థిరావు, బండె శ్రీను, మెండు లక్ష్మణరావు, తదితరులు ఉమా అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 

బంటుమిల్లిలో..

బంటుమిల్లి: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మంట కలిసిందని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పెడన ఇన్‌చార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్‌  విమర్శించారు.  దూషించిన మంత్రిపై ఎటువంటి చర్యలు చేపట్టకుం డా మాజీ మంత్రి ఉమాను అరెస్టు చేయడాన్ని కాగిత కృష్ణ ప్రసద్‌ తీవ్రంగా కండించారు. మండల పార్టీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు, ప్రముఖ న్యాయవ్యాది అంగర రంగనాధ్‌, కాశీ, జొన్నలగడ్డ కొండ, యార్లగడ్డశ్రీను, భూపతి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T06:48:03+05:30 IST