ఆ ముగ్గురిదీ ట్రై యాంగిల్‌ బిజినెస్‌ స్టోరీ: ఎంపీ కేశినేని

ABN , First Publish Date - 2021-07-12T16:42:25+05:30 IST

ఆ ముగ్గురిదీ..

ఆ ముగ్గురిదీ ట్రై యాంగిల్‌ బిజినెస్‌ స్టోరీ: ఎంపీ కేశినేని

విజయవాడ(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌, జగన్‌, షర్మిల.. ముగ్గురూ ఒక్కటేనని, రెండు రాష్ట్రాలను దోచుకోవడానికి ముగ్గురూ కలిసి నాటకం ఆడుతున్నారని టీడీపీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) విమర్శించారు. ఈ ముగ్గురిదీ ట్రై యాంగిల్‌ బిజినెస్‌ స్టోరీ అని వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలోని 19వ డివిజన్‌ టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దెతో కలిసి కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేసీఆర్‌, జగన్‌ అన్ని రకాలుగా సహకరించుకున్నారన్నారు. ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో ఇద్దరూ నాటకం ఆడుతున్నారన్నారు.


హెదరాబాద్‌లోని ఆస్తులు కాపాడుకునేందుకే కేసీఆర్‌కు జగన్‌ సరెండర్‌ అయ్యారని కేశినేని విమర్శించారు. ప్రతిపక్షం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేయిస్తున్న సీఎం జగన్‌.. నీటి వాటాల కోసం కేసీఆర్‌ సవాల్‌ చేస్తుంటే ఏం చేస్తున్నా డని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు, హక్కుల కోసం పోరాటం చేయాల్సింది జగన్‌, వైసీపీ నేతలేనని కేశినేని స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-12T16:42:25+05:30 IST