90 శాతం పట్టాలెక్కిన రైళ్లు

ABN , First Publish Date - 2021-08-02T06:15:40+05:30 IST

రైళ్ల పునరుద్ధరణ 90 శాతం జరిగింది.

90 శాతం పట్టాలెక్కిన రైళ్లు

(ఆంరఽధజ్యోతి, విజయవాడ) : రైళ్ల పునరుద్ధరణ 90 శాతం జరిగింది. కరోనా రెండో దశ తీవ్రత కాస్త తగ్గిన తరువాత దాదాపు రైళ్లన్నింటినీ పునరుద్ధరించారు. కరోనాకు ముందు విజయవాడ డివిజన్‌ మీదుగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 281 రైళ్లు, విజయవాడ డివిజన్‌ పరిధిలో 143 రైళ్లు నడిచేవి. జోన్‌ పరిధిలో నడిచే 281 రైళ్లలో 184 ఎక్స్‌ప్రెస్‌లు, 97 నాన్‌ డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండేవి. డివిజన్‌ పరిధిలో 92 డైలీ, 51 నాన్‌ డైలీ ఎక్స్‌ప్రెస్‌లు నడిచేవి. పాసింజర్‌ రైళ్లు జోన్‌ పరిధిలో 333, డివిజన్‌ పరిధిలో 127 నడిచేవి. పైన చెప్పుకున్న ఎక్స్‌ప్రెస్‌, పాసెంజర్‌ రైళ్లలో 90 శాతం  ప్రస్తుతం నడుస్తున్నాయి. కరోనా మూడో దశ రాకుంటే ఈ రైళ్లన్నీ యథావిధిగా నడుస్తాయి. 

Updated Date - 2021-08-02T06:15:40+05:30 IST