21న బందర్‌రోడ్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

ABN , First Publish Date - 2021-10-20T06:15:16+05:30 IST

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ సభను పురస్కరించుకుని ఈనెల 21న మహాత్మాగాంధీ రోడ్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు తెలిపారు.

21న బందర్‌రోడ్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

గుణదల : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ సభను పురస్కరించుకుని ఈనెల 21న మహాత్మాగాంధీ రోడ్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ ము న్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ సభకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, మంత్రులు హాజరు కానున్నట్టు చెప్పారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కంట్రోల్‌ రూమ్‌నుంచి బెంజిసర్కిల్‌ వైపు వెళ్లే వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లిస్తామన్నారు. ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బందర్‌రోడ్డులోకి వాహనాలకు అనుమతి లేదన్నారు. రూట్‌ నెంబరు 5లో వెళ్లే వాహనాలను ఏలూరు రోడ్డులోకి మళ్లించి రామవరప్పాడు రింగ్‌మీదుగా బెంజిసర్కిల్‌ చేరుకునేలా చేస్తామన్నారు. రెడ్‌సర్కిల్‌ నుంచి ఆర్‌టీఏ జంక్షన్‌ వరకు లాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. ఆహ్వానితుల వాహనాలకు పాస్‌ మంజూరు చేస్తామన్నారు. వారు నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పార్క్‌ చేయాలని కోరారు. 

Updated Date - 2021-10-20T06:15:16+05:30 IST