ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి : కలెక్టర్‌ నివాస్‌

ABN , First Publish Date - 2021-12-31T05:43:13+05:30 IST

కరోనా కొత్తరూపం ఓమైక్రాన్‌ వేగంగా ప్రజలకు సోకుతోందని, జిల్లా ప్రజలందరూ వంద శాతం వ్యాక్సిన్‌ వేయించుకుని ఓమైక్రాన్‌ను ఎదర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ సూచించారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌  వేయించుకోండి : కలెక్టర్‌  నివాస్‌

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌

వేయించుకోండి : కలెక్టర్‌  నివాస్‌

పాయకాపురం, డిసెంబరు 30 : కరోనా కొత్తరూపం ఓమైక్రాన్‌ వేగంగా ప్రజలకు సోకుతోందని, జిల్లా ప్రజలందరూ వంద శాతం వ్యాక్సిన్‌ వేయించుకుని ఓమైక్రాన్‌ను ఎదర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ సూచించారు. టెలీకాన్ఫెరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు మొదటి మోతాదు వ్యాక్సిన్‌ వేయించుకున్నావారు 98 శాతం మంది ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు 36,31,051 మంది మొదటి డోస్‌ తీసుకున్నారని, అలాగే రెండవ మోతాదు కింద 78 శాతం మంది అనగా 28,64,904 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారని తెలియజేశారు. జిల్లాలో మొదటి డోస్‌ తీసుకోని 2 శాతం మంది ప్రజలకు తక్షణం వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. అందు కోసం జిల్లాలో శుక్రవారం నుంచి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌  చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని, కళాశాలలు, పాఠశాలల్లో 15 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌  వేస్తున్నారని పేర్కోన్నారు. జేసీ ఎల్‌. శివశంకర్‌, సబ్‌  కలెక్టర్‌ జి. ప్రవీణ్‌ చంద్‌, ఆర్డీవోలు ఖాజావలి, రాజ్యలక్ష్మి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T05:43:13+05:30 IST